తెలంగాణ ఐసెట్ ఫలితాలు విడుదల.. ఇలా చెక్ చేసుకోవచ్చు
గురువారం, 29 జూన్ 2023 (12:17 IST)
తెలంగాణ ఐసెట్ ఫలితాలు గురువారం విడుదల కానున్నాయి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాలకు మే 26, 27 తేదీల్లో టీఎస్ ఐసెట్ (TS ICET) నిర్వహించిన సంగతి తెలిసిందే.
జూన్ 20న విడుదల కావాల్సిన తెలంగాణ ఐసెట్ ఫలితాలు వాయిదా పడ్డాయి. ఈ ఫలితాలు జూన్ 29 విడుదల కానున్నాయి. అభ్యర్థులు తెలంగాణ ఐసెట్ ఫలితాలను https://icet.tsche.ac.in/ వెబ్‌సైట్ ద్వారా చెక్ చేసుకోవచ్చు.