అనుపమా పరమేశ్వరన్ ఫ్రీడమ్ మిడ్‌నైట్, అలా రెచ్చిపోయిందట

శుక్రవారం, 8 జనవరి 2021 (18:09 IST)
డ్రస్ సెన్స్ గానీ, డైలాగ్ డెలివరీలో గానీ ఫర్ఫెక్ట్‌గా అనుపమ పరమేశ్వరన్ చేస్తారని మంచి పేరే ఉంది. ట్రెడిషనల్ వాల్యూస్‌తో ఏమాత్రం రాజీ పడదన్న పేరు కూడా ఉంది. కానీ ఇప్పుడు మాత్రం ఆమె ఎందుకిలా మారిపోయారు. పబ్లిసిటీ కోసం ఇంత దిగజారాలా అంటూ అభిమానులు అనుపమ పరమేశ్వరన్‌కు మెసేజ్‌లు చేస్తున్నారట.
 
శతమానంభవతి సినిమాలో తన అద్భుతమైన నటనతో అందరినీ ఆకట్టుకున్నారు అనుపమ. మిగతా సినిమాల్లో కూడా ఆమె రోల్ చాలా సింపుల్ గానే ఉండేది. అనుపమ నటించిన ఫ్రీడమ్ మిడ్‌నైట్ టీజర్లో ఒక డైలాగ్ చెప్పిన విధానం టీజర్‌ను అమాంతం ఎక్కువమంది చూసే విధంగా చేస్తోందట.
 
భార్యాభర్తల మధ్య ఎమోషనల్ డిఫరెన్స్ చూపించే విధంగా షార్ట్ ఫిల్మ్‌ను తీశారట. కానీ ఇందులో భర్తతో భార్య ఏ విధంగా ఉండాలోనన్న సీన్లను చూపించారట. అందులో బాగా నటించారట అనుపమ. దీంతో అందులోని టీజర్ చూసిన అభిమానులు ఎందుకు అనుపమ ఇలా చేస్తున్నావంటూ సందేశాలు పంపుతున్నారట.
 
ఇంతకీ అనుపమ ఉన్నట్లుండి షార్ట్ ఫిల్మ్ ఎంచుకుని ఇలాంటి క్యారెక్టర్లు చేయడమేంటి అన్న డౌట్ కూడా రావచ్చు. సమంతతో పాటు పూజా హెగ్డే ఇలాంటి క్యారెక్టర్లనే గతంలో చేశారట. రీసెంట్‌గా అతిథి అనే వెబ్ సిరీస్‌లో రూరల్ ఉమెన్‌గా కనిపించారు పాయల్ రాజ్ పుత్. ఆ వెబ్ సిరీస్ కాస్త బాగా ఆడిందట. కరోనాతో పెద్దగా సినిమాలు షూటింగ్‌లు కూడా జరగకపోవడంతో షార్ట్ ఫిల్మ్‌ల పైన పడిందట అనుపమ. కానీ మళ్ళీ సినిమాల్లోకి వచ్చేస్తానని చెబుతోందట. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు