నా భర్తను వదిలేయాలనుంది... సన్నీలియోన్

గురువారం, 12 ఏప్రియల్ 2018 (16:18 IST)
సన్నీలియోన్ సినిమా అంటే చాలు యువ ప్రేక్షకులందరూ వరుసగా సినిమా థియేటర్ల ముందు క్యూ కడతారు. సన్నీలియోన్ గెస్ట్ రోల్‌గా ఉన్నా ఫర్వాలేదు. ఆమెను చూస్తే చాలు అనుకున్న వారు లేకపోలేదు. అలాంటి సన్నీలియోన్‌కు కోట్లాదిమంది అభిమానులు ఉన్నారు. కేవలం బాలీవుడ్‌లోనే కాదు తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం ఇలా అన్ని భాషల్లోను సన్నీలియోన్‌కు అభిమానులు ఎక్కువే.
 
అలాంటి సన్నీలియోన్‌కు పెళ్ళై ఏడు సంవత్సరాలు అవుతోంది. డేనియల్ వెబర్ అనే వ్యక్తిని వివాహం చేసుకుంది సన్నీలియోన్. వివాహం అయిన తరువాత ఒక అమ్మాయిని ఈ దంపతులు దత్తత కూడా తీసుకున్నారు. ఆ తరువాత సన్నీలియోన్‌కు ఇద్దరు మగపిల్లలు పుట్టారు. దీంతో అంతకుముందు తీసుకువచ్చిన అనాధ చిన్నారిని కూడా సొంత బిడ్డలాగా ప్రేమగా చూసుకుంటున్నారు సన్నీలియోన్. అయితే నిన్న తన వివాహమై ఏడు సంవత్సరాలు పూర్తిచేసుకున్న సంధర్భంగా తన స్నేహితులతో సరదాగా మాట్లాడుతూ సన్నీలియోన్ నా భర్తను వదిలేయాలని ఉందని చెప్పిందట.
 
ఒకే సినిమా ఎన్నిరోజులు చూస్తాము.. కొత్తదనం కావాలి కదూ అంటూ స్నేహితులతో చెప్పుకొచ్చిందట. దీంతో స్నేహితులందరూ ఆశ్చర్యపోయారట. కొద్దిసేపటి తరువాత సన్నీలియోన్ నేను ఊరికే అంటున్నాను. నాకు మంచి స్నేహితుడు.. నా సర్వస్వం నా భర్తే. అలాంటి వ్యక్తి నేనెందుకు వదులుకుంటాను. ఎన్ని కష్టాలొచ్చినా నా భర్త నాకు అండగా ఉంటాడు. ప్రపంచంలో నా భర్త లాంటి వ్యక్తి బహుశా ఉండడని ఆ తరువాత స్నేహితులకు చెప్పుకొచ్చిందట సన్నీలియోన్.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు