అసాధారణ విజయం సాధించిన 'ఆనందం'తో తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో సుస్థిర స్థానం సంపాదించిన అందాల కథానాయకుడు ఆకాష్.. 'వసంతం, అందాల రాముడు, గోరింటాకు, నమో వేంకటేశ' తదితర చిత్రాలతోనూ విశేషంగా ఆకట్టుకున్నారు. కెరీర్ పరంగా ఇటీవల కాస్తంత వెనకబడ్డ ఆకాష్ ఇప్పుడు రెట్టించిన ఉత్సాహంతో.. పూర్వ వైభవం పొందే దిశగా అడుగులు వేస్తున్నారు.