ఇదిలా ఉంటే.. అనన్య నాగళ్ళ ఇప్పుడు స్మాల్ స్కేల్ విమెన్ సెంట్రిక్ సినిమాలకు కేరాఫ్ అడ్రెస్ గా మారిపోయారు. అనన్యతో రూ.5 కోట్ల బడ్జెట్లో లేడి ఓరియంటెడ్ సినిమాలు చేస్తే అవి ఈజీగా మార్కెట్ అవుతున్నాయి. 'తంత్ర' 'పొట్టేల్' 'బహిష్కరణ' 'శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్' వంటివి ఓటీటీలో మంచి రెస్పాన్స్ ను రాబట్టుకున్నాయి. ముఖ్యంగా 'తంత్ర' హిందీ వెర్షన్ జియో హాట్ స్టార్ లో టాప్ 2 లో ట్రెండ్ అవుతూ ఉండగా.. 'శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్' అయితే అమెజాన్ ప్రైమ్ వీడియో లో దేశ వ్యాప్తంగా ఇప్పటికీ టాప్ 5 లో ట్రెండ్ అవుతుంది.
అందుకే ఇప్పుడు దర్శకనిర్మాతలు రూ.5 కోట్ల బడ్జెట్లో తీసే లేడి ఓరియంటెడ్ సినిమాలకు అనన్య నాగళ్ళ బెస్ట్ ఆప్షన్ భావిస్తున్నారు. ఆమె వరుస ప్రాజెక్టులతో బిజీ బిజీగా గడుపుతున్నారు.అంతేకాదు ఇప్పుడు బాలీవుడ్ డెబ్యూ ఇవ్వడానికి కూడా రెడీ అయిపోయారు అనన్య నాగళ్ళ.ఈమె మెయిన్ లీడ్ గా ఒక హిందీ ప్రాజెక్టు కూడా రూపొందుతుంది.. అంటే ఈమె క్రేజ్, మార్కెట్ రాష్ట్రాలు దాటాయి అని అర్దం చేసుకోవచ్చు.