Sandeep Vanga: అర్జున్ రెడ్డిలా మారిన సందీప్ రెడ్డి.. దీపికాపై ఫైర్.. ఇదేనా మీ ఫెమినిజం అంటూ ఫైర్

సెల్వి

మంగళవారం, 27 మే 2025 (13:14 IST)
Sandeep Vanga-Deepika Padukone
ప్రముఖ దర్శకుడు సందీప్ రెడ్డి వంగా.. బాలీవుడ్ అగ్ర హీరోయిన్ దీపికా పదుకునేపై మండిపడ్డారు. ఈ స్టోరీ లైన్‌ను ఆమె లీక్ చేసిందని ఫైర్ అయ్యారు. రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్, ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు సందీప్ రెడ్డి వంగా కాంబినేష‌న్‌లో 'స్పిరిట్' అనే సినిమా తెర‌కెక్కుతున్న విష‌యం తెలిసిందే. 
 
అయితే, ఈ మూవీలో మొద‌ట దీపిక పదుకొణెని హీరోయిన్‌గా అనుకున్న‌ సందీప్ రెడ్డి.. ఆ త‌ర్వాత ఆమెను తీసేశారు. ఆమె స్థానంలోకి యానిమ‌ల్ బ్యూటీ త్రిప్తి డిమ్రీని తీసుకున్న సంగతి తెలిసిందే. దీనికి ప్రతి చర్యగా ఆమె పీఆర్ టీం స్పిరిట్ స్టోరీని లీక్ చేసిన‌ట్లు స‌మాచారం. 
 
దీంతో దీపిక పదుకొణె, ఆమె పీఆర్ టీమ్‌పై సందీప్ రెడ్డి వంగా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంకా ఎక్స్ వేదికగా దీపికా పీఆర్‌ను తిట్టిపోశారు. డర్టీ పీఆర్ గేమ్స్ అంటూ సందీప్ రెడ్డి వంగా తీవ్రస్థాయిలో మండిపడ్డారు. "నమ్మకంతో కథ చెప్పాను. ఇలా చేస్తారని అనుకోలేదు. ఈసారి మొత్తం స్టోరీని లీక్ చేసుకోండి" అంటూ ట్వీట్ చేశారు. ఇదేనా మీ ఫెమినిజం అంటూ సందీప్ రెడ్డి వంగా కౌంటర్లు కూడా వేశారు. 
 
ఇంకా సందీప్ మాట్లాడుతూ.. "నేను ఒక నటికి కథ చెప్పినప్పుడు ఆమెపై వందశాతం నమ్మకంతో చెబుతాను. మా మధ్య నాన్ డిస్కోజ్లర్ అగ్రిమెంట్ ఉంటుంది. కానీ ఇలాంటి వ్యవహారాలను మీరే బయటపెట్టుకున్నారు. ఓ యంగ్ నటిని కిందకు లాగడం, ఆమెను విమర్శించడం, నా స్టోరీని లీక్ చేయడం ఇదేనా" అంటూ ప్రశ్నించారు. 
 
తన మొత్తం ప్రపంచం సినిమానేనని.. ఇది ఎవరికీ అర్థం కాదని.. మొత్తం కథను బయటపెట్టేసినా తనకు పోయేదేమీ లేదని సందీప్ రెడ్డి వంగా ట్వీట్ చేశారు. 
 
బాలీవుడ్ అగ్రనటి దీపికాపైనే సందీప్ రెడ్డి వంగా విమర్శలు చేయడంపై సర్వత్రా చర్చ సాగుతోంది. సాధారణంగా మనవాళ్లు బాలీవుడ్‌లో మనవాళ్లు వీలైనంత వరకు మౌనంగా వుంటారు. తమ పని తాము చేసుకుని వెళ్ళిపోదాం అనుకుంటారు. కానీ సందీప్ అర్జున్ రెడ్డిలా సర్రున లేచాడు. 
 
తనకు జరిగిన అన్యాయంపై ఓపెన్ అయ్యాడు. అనుకున్నది అనుకున్నట్లు చేశాడు. పెద్ద హీరోయిన్, బాలీవుడ్ అని వంగా ఊరుకోలేరు. తప్పు తప్పేనంటూ ఓపెన్‌గా విమర్శించారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు