కోలీవుడ్‌లో విషాదం.. సీనియర్ ఫైట్ మాస్టర్ జూడో రత్నం మృతి

శుక్రవారం, 27 జనవరి 2023 (10:38 IST)
తమిళ చిత్రపరిశ్రమలో విషాదం నెలకొంది. సీనియర్ మోస్ట్ ఫైట్ మాస్టర్ జూడో రత్నం మృతి చెందారు. ఆయన వయసు 93 యేళ్ళు. వృద్దాప్యంతో పాటు అనారోగ్య సమస్యలతో బాధపడుతూ వచ్చిన ఆయన గురువారం తమిళనాడు రాష్ట్రంలోని వేలూరు జిల్లా గుడియాత్తంలో తుదిశ్వాస విడిచారు. ఆయన భౌతికకాయాన్ని శుక్రవారం ఉదయం చెన్నైకు తీసుకొచ్చి స్థానిక వడపళనిలోని సన్నిధి వీధిలో ఉన్న స్టంట్ మాస్టర్స్ యూనియన్ కార్యాలయంలో అభిమానుల సందర్శనం కోసం ఉంచారు. తిరిగి పార్థివదేహాన్ని గుడియాత్తంకు తీసుకెళ్లి అంత్యక్రియలు పూర్తి చేయనున్నారు. 
 
కాగా, ఈయన దివంగత నటులైన ఎంజీఆర్, శివాజీ గణేశ్, రాజ్‌కుమార్, ప్రేమ్ నజీర్, కృష్ణ, కృష్ణంరాజులతో పాటు చిరంజీవి, విజయ్, అజిత్ వంటి నేటి తరంతో పాటు దాదాపు 60 మందికిపైగా హీరోల చిత్రాలకు ఫైట్ మాస్టరుగా పని చేశారు. తెలుగు, తమిళం, కన్నడ, మలయాలం, హిందీంతో పాటు ఒక ఆంగ్ల చిత్రం ఇలా మొత్తం 1200కు పైగా 9 భాషా చిత్రాలకు ఆయన పని చేశారు. తన సిరీ కెరీర్‌లో 63 మంది హీరోల చిత్రాలకు పోరాట దృశ్యాలు చిత్రీకరించినందుకు గాను ఆయన గిన్నిస్ రికార్డు సాధించారు. 
 
2019లో తమిళనాడు ప్రభుత్వం ఆయనకు "కలైమామణి" అవార్డుతో సత్కరించింది. తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ అభిమాన ఫైట్‌మాస్టరుగా గుర్తింపు పొందిన జూడో కేకే రత్నం.. రజనీకాంత్ నటించిన 46 చిత్రాలకు ఫైట్‌మాస్టరుగా పని చేసారు. ఆయన పోరాట దృశ్యాలు సమకూర్చిన చిత్రం "పాండ్యన్" అనే తమిళ చిత్రం. ఇది గత 1992లో విడుదలైంది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు