'కాంచన 3' ట్రైలర్.. నువ్వు మాస్ అయితే నేను డబుల్ మాస్ (Video)

గురువారం, 28 మార్చి 2019 (16:08 IST)
ముని 4, కాంచన 3 సినిమా రానుంది. లారెన్స్ స్వీయ దర్శకత్వంలో తమిళంలో తెరకెక్కిన హారర్ సినిమాలు భారీ విజయాలు సాధించాయి. తెలుగులోనూ ఈ సినిమాలకు మంచి ఆదరణ లభిస్తుంది. 
 
తాజాగా లారెన్స్ దర్శకత్వంలో 'కాంచన 3' రూపొందింది. ఈ సినిమా నుంచి ట్రైలర్ విడుదల అయ్యింది. నెరసిన గెడ్డం మీసాలతో.. కాస్త వయస్సు మళ్లిన లుక్‌తో లారెన్స్ కొత్తగా కనిపించాడు. 
 
సస్పెన్స్, హారర్, యాక్షన్ సన్నివేశాలపై ఈ ట్రైలర్‌ను కట్ చేశారు. ఈ ట్రైలర్ బలమైన ప్రతినాయకుడిగా కబీర్ దుహాన్ సింగ్ కనిపిస్తున్నాడు. నాకేమైనా వదిలేస్తా.. నా వాళ్లకు ఏమైనా అయితే వదిలిపెట్టను. నువ్వు మాస్ అంటే నేను డబుల్ మాస్ అని లారెన్స్ చెప్పే డైలాగ్స్‌ అదరగొట్టాయి. 
 
ఇక వేదిక, ఓవియా హీరోయిన్లుగా నటించిన ఈ సినిమా ఏప్రిల్ 19వ తేదీన విడుదల కానుంది. తాజాగా విడుదలైన ఈ సినిమా ట్రైలర్‌ను మీరూ ఓ లుక్కేయండి. 
 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు