యుగంధర్ ముని దర్శకత్వంలో ప్రతిష్టాత్మక షైనింగ్ పిక్చర్స్ బ్యానర్‌పై రాజశేఖర్ అన్నభీమోజు, మహీధర్ రెడ్డి నిర్మిస్తున్న చిత్రం శంబాల: ఎ మిస్టికల్ వరల్డ్. ప్రామిసింగ్ స్టార్ ఆది సాయికుమార్ మొదటి సారిగా సూపర్ నేచురల్ హారర్ థ్రిల్లర్ చిత్రంతో రాబోతున్నారు. ఇప్పటికే రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్, అర్చనా అయ్యర్, స్వసిక కారెక్టర్ లుక్ పోస్టర్‌లు ఎంతగా వైరల్ అయ్యాయో అందరికీ తెలిసిందే. ప్రస్తుతం మేకర్స్ ఇప్పుడు మరో కీలక పాత్రను పరిచయం చేశారు.