కార‌వ్యాన్ డ్రైవ‌ర్ కుటుంబానికి మెగాస్టార్ లక్ష సాయం

గురువారం, 20 మే 2021 (16:51 IST)
swaminaidu, kondeti, jayaram family
చిరంజీవి కార‌వ్యాన్ డ్రైవ‌ర్ కిలారి జయరామ్ కరోనా సోకి మృతి చెందిన సంగ‌తి తెలిసిందే. ఆయ‌న‌కు భార్య కె.శోభారాణి. ఒక కుమార్తె వినోదిని (8) ఇద్ద‌రు కుమారులు కౌశిక్ (18), జ‌స్వంత్(12) ఉన్నారు. జయరామ్ మృతి ఆ కుటుంబాన్ని తీవ్ర క‌ల‌త‌కు గురి చేసింది. అనంత‌రం జయరామ్ కుటుంబాన్ని మెగాస్టార్ ఆదుకున్నారు. మెగాస్టార్ చిరంజీవి అత‌డి కుటుంబానికి లక్ష రూపాయల చెక్ ని పంపించారు. జయరామ్ భార్య శోభ వారి పిల్ల‌లు చిరంజీవి బ్ల‌డ్ బ్యాంక్ కి వ‌చ్చి చిరంజీవి యువ‌త అధ్య‌క్షుడు ర‌వణం స్వామినాయుడు చేతుల‌మీదుగా ఈ చెక్ ని అందుకున్నారు.
 
ఈ సంద‌ర్భంగా జయరామ్ భార్య శోభారాణి మాట్లాడుతూ- ``చిరంజీవి గారు అన్నివేళ‌లా ఆప‌ద్భాంద‌వుడు. ప్ర‌తిసారీ మా కుటుంబానికి ఏ క‌ష్టం వ‌చ్చినా ఆదుకున్నారు. ఇంత‌కుముందు మా వారు (జయరామ్) బైక్ పై వెళుతూ యాక్సిడెంట్ కి గుర‌య్యారు. వెంట‌నే ఉపాస‌న గారికి ఫోన్ చేసి వైద్య స‌హాయం అందించారు. అప్పుడు మా కుటుంబానికి ఆర్థిక క‌ష్టం లేకుండా ఆదుకున్నారు. ఇప్పుడు మ‌రోసారి నా కుటుంబాన్ని ఆదుకున్నారు. ఇది నా పిల్ల‌ల‌కు పెద్ద సాయం. చిరంజీవి గారికి నా కృత‌జ్ఞ‌త‌లు`` అని అన్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు