కళ్యాణ్ రామ్‌ యాక్షన్‌ చిత్రంలో విజయశాంతి

డీవీ

సోమవారం, 24 జూన్ 2024 (14:19 IST)
Vijayashanthi
కళ్యాణ్ రామ్‌ 21 వ చిత్రం షూటింగ్ హైదరాబాద్ లో జరుగుతోంది. అశోక క్రియేషన్స్ మరియు ఎన్టీఆర్ ఆర్ట్స్ పతాకాలపై అశోక్ వర్ధన్ ముప్పా, సునీల్ బలుసు నిర్మిస్తున్నారు.  ముప్పా వెంకయ్య చౌదరి సమర్పిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్‌లో భారీ స్థాయిలో జరుగుతోంది. యాక్షన్ పార్ట్ చిత్రీకరిస్తున్నారు. 
 
తాజాగా విజయశాంతి ఈ సినిమాతో ఎంట్రీ ఇచ్చింది. సరిలేరు నీ కెవ్వరూ సినిమాలో మహేష్ బాబు సినిమాలో నటించిన ఆమె కళ్యాణ్ రామ్ సినిమాలో పోలీస్ ఆపీసర్ గా నటిస్తోంది. ఈ చిత్రానికి రచయిత & దర్శకుడు: ప్రదీప్ చిలుకూరి. 
 
ఈ చిత్రంలో సోహెల్ ఖాన్, సాయి మంజ్రేకర్ మరియు శ్రీకాంత్ కూడా ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. చాలా కాలం తర్వాత ఈ పాత్ర పోషిస్తున్నట్లు ఆనందం వ్యక్తం చేసింది.
 
సినిమాకు సంబంధించిన ఇతర వివరాలు తెలియాల్సి ఉంది. రామ్ ప్రసాద్ కెమెరా, అజనీష్ లోక్‌నాథ్ మ్యూజిక్, శ్రీకాంత్ విస్సా స్క్రీన్ ప్లే, తమ్మిరాజు ఎడిటర్ గా వ్యవహరిస్తున్నారు. 
తారాగణం: నందమూరి కళ్యాణ్ రామ్, విజయశాంతి, సోహెల్ ఖాన్, సాయి మంజ్రేకర్, శ్రీకాంత్ & ఇతరులు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు