మంచి నిర్మాణ విలువలతో, భారీ బడ్జెట్ తో ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా ఓసి చిత్రాన్ని తెరకెక్కించినట్టు మేకర్స్ తెలిపారు. అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునేలా కథాకథను ఉంటుందని.. థియేటర్లో చూసే వీక్షకులను ఓసి కట్టిపడేస్తుందని చిత్ర యూనిట్ నమ్మకంగా ఉన్నారు. ఈ చిత్రానికి లక్ష్మీకిరణ్ కథ, సాయిరాం తుమ్మలపల్లి సినిమాటోగ్రఫీ అందించగా డాన్స్ మాస్టర్ సత్య కొరియోగ్రఫీ అందించగా, వంశీ ఎస్. అక్షర్ బ్యాండ్ సంగీతం సమకూరుస్తున్నారు. ఇంతకీ ఓసి అంటే ఏంటో చూడాలంటే జూన్ 7 వరకు వేచి ఉండాల్సిందే.
నటీనటులు: హరీష్ బొంపెల్లి, మాన్య సలాడి, రోయల్ శ్రీ, లక్ష్మీ కిరణ్ తదితరులు.
దర్శకత్వం: విష్ణు బొంపెల్లి, నిర్మాత: బీవీఎస్, సినిమాటోగ్రఫీ: సాయిరాం తుమ్మలపల్లి, సంగీత దర్శకుడు: భోలే శివాలి, పీఆర్ఓ: హరీష్, దినేష్