ప్రియమణి భామా కలాపం 2 ఫస్ట్ లుక్ విడుదల

శుక్రవారం, 24 నవంబరు 2023 (06:51 IST)
Bhama Kalapam 2 First Look
ఇంతకు ముందుకు ప్రియమణి ప్రధాన పాత్రలో నటించిన ‘భామాకలాపం’.. విశ్వక్‌సేన్ హీరోగా నటించిన చిత్రం ‘అశోకవనంలో అర్జున కళ్యాణం’లతో రెండు వరుస సక్సెస్‌లను సొంతం చేసుకున్న డ్రీమ్ ఫార్మర్స్ ఇప్పుడు ‘భామా కలాపం 2’తో మరో చక్కటి సినిమాను అందించనున్నారు. త్వరలోనే ఇది థియేటర్స్‌లో విడుదల కావటానికి సిద్ధమవుతోంది.
 
డ్రీమ్ ఫార్మర్స్‌తొో పాటు ఆహా స్టూడియోస్ సంయుక్తంగా రూపొందిస్తోన్న ‘భామా కలాపం 2’లో మంచి పెర్ఫామెన్స్ చేసే నటీనటులు, సాంకేతిక నిపుణులున్నారు. దీంతో మూవీపై మంచి అంచనాలు మొదలయ్యాయి. ప్రియమణి ప్రధాన పాత్రలో నటిస్తోంది. శీరత్ కపూర్, శరణ్య, రఘు ముఖర్జీ, బ్రహ్మాజీ తదితరులు ఇతర పాత్రల్లో నటిస్తున్నారు. అభిమన్యు తాడిమేటి దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ మూవీని బాపినీడు, సుధీర్ ఈదర నిర్మిస్తున్నారు. త్వరలోనే సినిమా థియేటర్స్‌లో సందడి చేయనుంది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు