"పుష్ప 2" జనవరి రెండవ వారం నుండి OTTలో స్ట్రీమింగ్ ప్రారంభమవుతుందని ఊహాగానాలు వచ్చాయి. అయితే, నిర్మాణ సంస్థ, మైత్రి మూవీ మేకర్స్, వారి అధికారిక ఎక్స్ ఖాతాలో ఓ ప్రకటన చేసింది.
ఈ పుకార్లను ప్రస్తావిస్తూ "పుష్ప 2: ది రూల్ ఓటీటీ విడుదల గురించి కథనాలు వస్తున్నాయి. రాబోయే ప్రధాన సెలవు సీజన్లో పెద్ద స్క్రీన్‌పై ఈ వైల్డ్ ఫైర్ అనుభవాన్ని ఆస్వాదించండి. ఈ చిత్రం థియేటర్లలో విడుదలైన 56 రోజుల ముందు ఏ OTT ప్లాట్‌ఫారమ్‌లోనూ ప్రసారం చేయబడదు. ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో మాత్రమే 'పుష్ప 2'ని వీక్షించండి" అంటూ క్లారిఫై ఇచ్చింది.