బాబీ సింహా పుట్టిన‌రోజు (Nov6) సంద‌ర్భంగా వ‌సంత కోకిల ఫ‌స్ట్ లుక్ విడుద‌ల చేసిన స్టార్ హీరో రానా

గురువారం, 5 నవంబరు 2020 (22:43 IST)
ఎస్ఆర్టి ఎంట‌ర్టైన్మెంట్స్, ముద్ర ఫిల్మ్ ఫ్యాక్ట‌రీ బ్యానర్లు సంయుక్తంగా తెలుగు, త‌మిళ, క‌న్న‌డ భాష‌ల్లో జాతీయ అవార్డు గ్ర‌హీత బాబీ సింహా హీరోగా రూపొందిస్తోన్న‌ ట్రైలింగ్వ‌ల్ మూవీ వ‌సంత కోకిల‌. ప్ర‌ముఖ నిర్మాత రామ్ త‌ళ్లూరి నిర్మాణ సార‌ధ్యంలో నూత‌న ద‌ర్శ‌కుడు ర‌మ‌ణ‌న్ పురుషోత్త‌మ ఈ సినిమాను తెర‌కెక్కిస్తున్నారు. ఈ చిత్రంలో బాబీ సింహాకి జోడిగా న‌ర్త‌న‌శాల ఫేమ్ కాశ్మీర ప‌ర్ధేశీ హీరోయిన్‌గా న‌టిస్తోంది.
 
నవంబ‌న్ 6న బాబీ సింహా పుట్టిన రోజు సంద‌ర్భంగా ప్ర‌ముఖ తెలుగు స్టార్ హీరో ఈ సినిమా టైటిల్ వ‌సంత కోకిలని ఎనౌన్స్ చేయ‌డంతో పాటు త‌న ట్విట్ట‌ర్ ఖాతా ద్వారా ఫ‌స్ట లుక్‌ని కూడా విడుద‌ల చేశారు. అలానే త‌మిళ నుంచి స్టార్ హీరో ధ‌నుష్, క‌న్న‌డ స్టార్ హీరో ర‌క్షిత్ శెట్టి కూడా ఈ సినిమాకి సంబంధించిన త‌మిళ‌, క‌న్న‌డ టైటిల్స్‌తో పాటు ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్ల‌ని ఆన్లైన్లో రిలీజ్ చేశారు. రొమాంటిక్ థ్రిల్ల‌ర్ జాన‌ర్‌గా ఈ సినిమా రెడీ అవుతుంది. తాజాగా విడుద‌లైన ఫ‌స్ట్ లుక్‌లో బాబీ సింహా విల‌క్ష‌ణ‌త ప్ర‌తిబింబిచేలా చేతిలో బౌ అండ్ యారో, ఫారేస్ట్ బ్యాక్ డ్రాప్, డార్క్ గ్రిన్ క‌ల‌ర్ టింట్ ఇలా ఎన్నో ఉత్కంఠ రేపే ఎలిమెంట్స్ ఉన్నాయి.
 
సినిమా జాన‌ర్‌కి, బాబీ సింహా అత్యుత్త‌మ ప‌ర్ఫార్మెన్స్‌కి త‌గిన విధంగానే ద‌ర్శ‌కుడు ర‌మ‌ణ‌న్ వ‌సంత కోకిలను తెర‌కెక్కించార‌ని చిత్ర బృందం కాన్ఫిడెంట్‌గా చెబుతోంది. జాతియ అవార్డు గ్ర‌హిత‌, విల‌క్ష‌ణ హీరో క‌మ‌లహాస‌న్, శ్రీదేవి కాంబినేష‌న్లో వ‌చ్చిన వ‌సంత కోకిల ఏ రేంజ్ స‌క్సెస్ అందుకుందో అంద‌రికీ తెలిసిందే. ఇప్పుడు అదే టైటిల్‌తో తెర‌కెక్కుతున్న సినిమాలో మ‌రో జాతీయ అవార్డు గ్ర‌హీత బాబీ సింహా న‌టించ‌డం విశేషం. థింక్ మ్యూజిక్ వారు ఈ సినిమా ఆడియో రైట్స్ ద‌క్కించుకున్నారు. ఈ సినిమాకి సంబంధించిన మ‌రిన్ని వివ‌రాలు త్వ‌ర‌లోనే అధికారికంగా విడుద‌ల చేస్తామ‌ని నిర్మాత రామ్ త‌ళ్లూరి తెలిపారు.
 
న‌టీన‌టులు: బాబీ సింహా, కాశ్మీర ప‌ర్ధేశీ, సాంకేతిక వ‌ర్గం: ర‌చ‌న, ద‌ర్శ‌క‌త్వం - ర‌మ‌ణ‌న్ పురుషోత్త‌మ‌, మ్యూజిక్ - రాజేశ్ మురుగేశ‌న్, డిఓపి - గోపీ అమ‌ర‌నాథ్, ఎడిట‌ర్ - వివేక్ హ‌ర్ష‌న్, ప్రొడ‌క్ష‌న్ డిజైన్ - నాగ్ రాజ్ ఆర్ కే, యాక్ష‌న్ - స్ట‌న్న‌ర్ శామ్, స్టంట్ స్లివా, ఆడియోగ్ర‌ఫి - తాపాస్ నాయ‌క్, కాస్ట్యూమ్ డిజైన‌ర్ - నందిని ఎన్ కే, కొరియోగ్ర‌ఫి - ఎమ్ ష‌రీఫ్, విజీస‌తీష్, ప్రొడ‌క్షన్ ఎక్స్ క్యూటీవ్ - ఆర్ పి బాల గోపి, ఎక్సీక్యూటివ్ ప్రొడ్యూస‌న్ - స‌తీష్ సుంద‌ర్ రాజ్, లైన్ ప్రొడ్యూస‌ర్స్ - జే విద్య సాగ‌ర్, యూ. దిలీప్ కుమార్, ప్రొడ‌క్ష‌న్ కంట్రోల‌ర్ - చెన్నూరు మ‌హేంద‌ర్, ప్రొడ‌క్ష‌న్ మ్యానేజ‌ర్ - విశ్వ‌నాథ‌న్, స్టిల్స్ - శ్రీ బాలాజీ, పీఆర్ఓ - ఏలూరు శ్రీను, మేఘ‌శ్యామ్, పబ్లిసిటీ డిజైన్స్ - ట్యూనీ జాన్ 24 ఎమ్, లిరిక్స్ - చంద్ర బోస్, డైలాగ్స్ - రాజేశ్ ఏ మూర్తి, నిర్మాత‌లు - ర‌జ‌నీ త‌ళ్లూరి, రేష్మీ సింహా.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు