గోవాలో జరిగిన 'ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా' వేడుకల్లోనూ ఈ చిత్రాన్ని ప్రదర్శించగా విశేష స్పందన దక్కింది. అలాంటి సినిమాని థియేటర్లలో విడుదల చేసేందుకు ప్రతికూల పరిస్థితులు ఏర్పడడం, ఆర్థిక సమస్యలు చుట్టుముట్టడంతో విజయ్ మానసికంగా కుంగిపోయారు. 'ఖుదీరామ్ బోస్' గురించి ఈ తరానికి తెలియజేయాలనే తన ఆకాంక్ష నెరవేరకపోతోందనే బాధతో ఆస్పత్రి పాలయ్యారు.
తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, బెంగాలీ, హిందీలో రూపొందిన ఈ చిత్రానికి విద్యాసాగర్ రాజు దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో రాకేశ్ జాగర్లమూడి, వివేక్ ఒబెరాయ్, అతుల్ కులకర్ణి కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమా ఫస్ట్ లుక్‌ని భారత మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు గతేడాది ఆగస్టులో విడుదల చేశారు. ప్రముఖ సాంకేతిక నిపుణులు ఈ చిత్రానికి పనిచేశారు. సంగీతం: మణిశర్మ, ఆర్ట్ డైరెక్టర్: తోట తరణి, స్టంట్స్: కనల్ కన్నన్, సినిమాటోగ్రఫీ: రసూల్ ఎల్లోర్, ఎడిటింగ్: మార్తాండ్ కె. వెంకటేశ్.