రాత్రి 12 గంటల వరకు నిర్భయ మగ వ్యక్తితో ఎందుకు తిరిగింది..?

శుక్రవారం, 20 మార్చి 2020 (11:16 IST)
నిర్భయ నిందితులకు వత్తాసు పలికిన వారి తరపు న్యాయవాది ఏపీ సింగ్ నోరు పారేసుకున్నాడు. న్యాయవాదిగా ఉంటూ అన్యాయానికే సపోర్టు చేస్తూ ఏడు సంవత్సరాల పాటు అందరి చేత ఛీ కొట్టించుకున్న ఏపీ సింగ్ మరోసారి తన నీచమైన వ్యక్తిత్వాన్ని బయటపెట్టాడు. కేసు ఓడిపోయిన తరువాత అతడు నిర్భయపై చేసిన వ్యాఖ్యలు వింటుంటే ఎవరికైనా అతడిని పట్టుకుని పిచ్చ కొట్టుడు కొట్టాలనిపిస్తుంది.
 
ఇంకా అతడు మాట్లాడుతూ.. నిర్భయ రాత్రి 12:00 గంటల వరకు ఎందుకు ఒక మగ వ్యక్తితో బయట తిరుగుతుందో తన తల్లిని చెప్పమనండి అంటూ ప్రశ్నించాడు. ఆమెకు తెలియదు తన బిడ్డ ఎక్కడికి వెళ్ళిందో ఏం చేస్తుందో అనేది కూడా అంటూ నిర్భయ క్యారెక్టర్‌ని తప్పుబట్టాడు. ఇంకా మధ్య వేలిని ఎత్తి చూపించాడు. దాంతో ఆయన మాటల్ని విన్న చాలా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ తిట్టిపోశారు.
 
వాస్తవానికి రాత్రి సమయంలో బయటకు వచ్చిన ప్రతి మహిళని మానభంగం చేయోచ్చనట్టు మాట్లాడాడు. ఇలాంటి వ్యక్తులు రేపిస్టుల కంటే ప్రమాదకరమని.. పనిలో పని ఇతన్ని కూడా నలుగురితో ఉరి తీసినట్టు అయితే బాగుండేదని చాలా మంది అభిప్రాయపడుతున్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు