ముంబై విమానాశ్రయం పేరుకు మరో పదం వచ్చి చేరింది. అదే ఛత్రపతి శివాజీ అంతర్జాతీయ విమానాశ్రయం పేరుకు మహరాజ్ అనే పదాన్ని జోడిస్తున్నట్లు ప్రభు గురువారం తెలిపారు. దీంతో చాలాకాలంగా మహారాష్ట్ర ప్రజలు చేస్తున్న డిమాండ్ నెరవేరిందని వెల్లడించారు. పనిలోపనిగా ఈ డిమాండ్‌ను పరిష్కరించేందుకు చొరవచూపిన ప్రధాని నరేంద్ర మోడీకి ప్రభు ధన్యవాదాలు కూడా తెలిపారు.
మరొకరు విమానాశ్రయానికి 'హిందూ హృదయ్ సామ్రాట్ శ్రీ ఛత్రపతి శివాజీ మహరాజ్ సాహిబ్ కీ జై.. జై.. జై.. మహారాష్ట్ర ముంబై అంతర్జాతీయ విమానాశ్రయం అని పేరు పెట్టండి' అంటూ వ్యంగ్యంగా స్పందించాడు. తమకు ఇలాంటి పేర్ల మార్పులు వద్దనీ, ఎన్నికల్లో ఇచ్చిన అభివృద్ధి హామీల అమలు, నల్లధనం వెనక్కి తీసుకురావడం, ఉద్యోగ కల్పనపై దృష్టి పెట్టాలని మరో వ్యక్తి చురకలు అంటించాడు.