భద్రతా సంస్థకు చెందిన సిబ్బంది ఎవరూ వీటిని వినియోగించరాదని సూచన చేసాయి. జూమ్, టిక్‌టాక్, యూసీ బ్రౌజర్, జెండర్, షేర్ఇట్, క్లీన్ మాస్టర్ సహా 52 ఇతర మొబైల్ అప్లికేషన్ల ద్వారా డేటా తస్కరణకు గురవుతుందని ఓ నివేదికను ప్రభుత్వానికి నిఘా విభాగం సమర్పించింది.
ఈ నివేదికపై ఇప్పటికే “జాతీయ భద్రతా మండలి” సానుకూలంగా స్పందించిందని, దీనికి సంబంధించిన చర్చలు కొనసాగుతున్నాయని ఓ అధికారి వెల్లడించారు. “జూమ్ వీడియో కాలింగ్” యాప్ ద్వారా వినియోగదారుల గోప్యతకు ముప్పు ఉందని ఈ ఏడాది ఏప్రిల్‌లో కేంద్రం ప్రకటన చేసింది.
ప్రభుత్వ సమావేశాలకు ఈ యాప్‌ని వినియోగించరాదంటూ ప్రభుత్వం స్పష్టం చేసింది. “జూమ్ యాప్” వాడకంపై పలు దేశాలు ఇప్పటికే ఆంక్షలు విధించగా, కొన్ని దేశాల్లో పూర్తిగా నిషేధం కొనసాగుతుంది. జర్మనీలో ఈ యాప్‌పై ఆంక్షలు విధించగా, తైవాన్‌లో పూర్తిగా “జూమ్” వాడరాదంటూ ప్రభుత్వం నిషేధం పెట్టింది. అమెరికా కూడా సెనేట్ సభ్యులను “జూమ్ యాప్” కాకుండా ఇతర సోషల్ నెట్ వర్కింగ్ యాప్‌లను ఉపయోగించాలని పేర్కొంది.