కాచిగూడలో తృటిలో ప్రమాదం తప్పింది. కాచిగూడ రైల్వే స్టేషన్లో ఆగివున్న ట్రైన్‌ను వెనకనుంచి మరొక ఎంఎంటిఎస్ ట్రైన్ ఢీకొంది. విషయం తెలుసుకున్న grp రైల్వే పోలీసులు హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకున్నారు. టెక్నికల్ లోపం వల్లే ప్రమాదం జరిగిందని అంటున్నారు అధికారులు. ఎవరికి ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు కానీ డ్రైవర్ మాత్రం క్యాబిన్‌లో చిక్కుకున్నారు.