ఈ నేపథ్యంలో ఓ పాకీస్తానీ మహిళ అడిగిన ప్రశ్నకు బాలీవుడ్ స్టార్ హీరోయిన్, హాలీవుడ్ స్టార్ ప్రియాంక చోప్రా అదిరిపోయే సమాధానం ఇచ్చింది. గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా లాస్‌ఏంజెల్స్‌లో తాజాగా బ్యూటీకాన్ అనే ఓ ప్రోగ్రామ్‌లో పాల్గొంది. ప్రత్యేక అతిథిగా ఈ కార్యక్రమానికి హాజరైన ప్రియాంక చోప్రా అభిమానులు అడిగిన ప్రశ్నలకు సమాధానాలిచ్చింది.
పాకిస్థాన్‌లో తనకు ఎంతోమంది స్నేహితులు వున్నారు. ''నేను ఇండియన్.. నా దేశం పట్ల నాకు గౌరవం ఉంటుంది. అయితే నేను రెచ్చకొట్టేలా మాట్లాడలేదు. నువ్వు నీ దేశం కోసం ఎలా ప్రశ్నిస్తావో.. నేను నాదేశం తరపున అలాగే ఉంటాను. ఇలా మీరు సందర్బం లేకుండా అరవడం వలన ఎవరికీ ఉపయోగం లేదు.. అందరిలోనూ పరువు పోగొట్టుకోవడం తప్ప" అని గట్టిగా సమాధానం ఇచ్చింది. దానికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.