అతనిలో మచ్చుకైనా పశ్చాత్తాపం కనిపించలేదు. కన్నబిడ్డను చిన్నవయసులోనే విధవరాలిని చేశానన్న బాధ లేశమాత్రం కూడా లేదు. పైగా, మీడియా ముందుకు ప్యాంటు జేబులో రెండు చేతులు పెట్టుకుని ఠీవీగా మీడియా ముందుకు వచ్చాడు. ప్రణయ్ హత్య కేసులోని నిందితులను నల్గొండ పోలీసులు మీడియా ముందు ప్రవేశపెట్టగా కొందరు తలదించుకోగా, ఏ1 నిందితుడు మారుతిరావు మాత్రం దిలాసాగా కనిపించాడు.
కానీ, ఈ కేసులో ఏ1 నిందితుడుగా ఉన్న మారుతీ రావులో మాత్రం ఏమాత్రం పశ్చాత్తాపం కనిపించలేదు. ప్యాంటు జేబుల్లో రెండు చేతులు పెట్టుకుని ఎంతో దిలాసాగా కనిపించాడు. ఇప్పుడు మాత్రమే కాదు.. హత్య కేసు విచారణలో కూడా మారుతీరావు తన రోజువారీ జీవితంలో ఉన్నట్టే ఎంతో దిలాసాతో కనిపించాడని పోలీసులు చెప్పారు.
తన కుమార్తె అమృతను ప్రేమించి పెళ్లి చేసుకున్న దళిత వర్గానికి చెందిన ప్రణయ్‌ను వేరు చేయాలని, అవసరమైతే ఈ భూమ్మీదే ప్రణయ్‌ను లేకుండజా చేయాలన్న తన లక్ష్యం నెరవేరిందనే భావన అతనిలో కొట్టొచ్చినట్టు కనిపించింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు మారుతీ రావు ముఖంలో ఎలాంటి పశ్చాత్తాపం కనిపించలేదని పోలీసులు వ్యాఖ్యానించారు.