పురుషుడికి శీలపరీక్ష.. ఎక్కడో కాదు.. మన తెలంగాణాలోనే!!

శుక్రవారం, 3 మార్చి 2023 (21:24 IST)
సాధారణంగా స్త్రీలకు కొన్ని గ్రామాల్లో శీలపరీక్ష నిర్వహిస్తుంటారు. ఈ శీలపరీక్షలో కన్యగా నిర్ధారణ అయితేనే పురుషులు పెళ్లి చేసుకుంటారు. ఇలాంటి ఆచారం దేశంలోని పలు కొన్ని వర్గాలకు చెందిన ప్రజల్లో ఉంది. ఆధునిక ప్రపంచంలో ఇలాంటి ఆచారం లేదని చాలా మంది గట్టిగా నమ్ముతారు. నిజం చెప్పాలంటే స్త్రీలకు శీలపరీక్షే కాదు సుమా.. పురుషులకు కూడా ఈ తరహా పరీక్ష నిర్వహించే గ్రామాలు ఉన్నాయి. ఇలాంటి గ్రామం తెలంగాణ రాష్ట్రంలోని ములుగు జిల్లాలో ఉంది. ఇక్కడ ఓ పురుషుడుకి శీలపరీక్ష నిర్వహిస్తారు. ఎర్రగా కాలిన బొగ్గును నుంచి గడ్డపారను తీసి తాను శీలవంతుడిని అని పురుషుడు నిరూపించుకోవాల్సి ఉంటుంది. ఈ పరీక్షకు అంగీకరించరిన ఓ వ్యక్తి వీడియో ఒకటి ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 
 
ములుగు జిల్లా ములుగు మండలం, జంగాలపసల్లి సమీపంలోని బంజర్ పల్లి గ్రామానికి చెందిన జగన్నాథం అనే వ్యక్తి ఈ శీలపరీక్షను ఎదుర్కొన్నారు. గంగాధర్ అనే వ్యక్తి తన భార్యతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడని గ్రామ పంచాయతీ సమావేశం ఏర్పాటు చేసి పెద్ద మనుషులకు చెప్పాడు. అయితే, తనకు ఎలాంటి సంబంధం లేదని గంగాధర్ నెత్తినోరూ బాదుకున్నా గ్రామ పెద్దలు పట్టించుకోలేదు. నీకు ఎలాంటి సంబంధం లేకపోతే శీలపరీక్షకు సిద్ధం కావాలని ఆదేశించారు. 
 
దీంతో సదరు వ్యక్తి చేసేదేం లేక ఆ పరీక్షకు అంగీకరించారు. పంచాయతీ పెద్దలు చెప్పినట్టుగానే నదిలో పవిత్ర స్నానం చేసిన గంగాధర్ ఎర్రగా కాలిన గడ్డపారను నిప్పుల్లో నుంచి తీశాడు. అతని చేతులు కాలకపోవడంతో ఎలాంటి గాయాలు కాలేదు. ఈ పరీక్షలో నెగ్గినప్పటికీ తన వద్ద నుంచి పంచాయతీ పెద్దలు డబ్బులు వసూలు చేశారని, అందువల్ల తనకు న్యాయం చేయాలంటూ పోలీసులను ఆశ్రయించాడు.
 
అయితే, ఈ అగ్నిపరీక్షలో ఈ కలియుగ రాముడు నెగ్గారు. అయినా సరే గ్రామపెద్దలు నీవు తప్పు చేశావంటూ తీర్పునిచ్చారు. దీంతో బాధితుడు పోలీసులను ఆశ్రయించి, జరిగిన విషయాన్ని వివరించడంతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. ఈ ఘటన గత నెల 25వ తేదీన చోటుచేసుకుంది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు