ఉదయపూర్ బయోలాజికల్ పార్కులో ఈ ఘటన జరిగింది. వివరాల్లోకి వెళితే ఉదయపూర్ నగరంలోని సజ్జన్‌ఘడ్ బయోలాజికల్ పార్కులో ఆడపులి దామిని, మగపులి కుమార్‌ని అధికారులు రెండు వేర్వేరు ఎన్‌క్లోజర్లలో ఉంచారు. పటిష్టమైన భద్రత కల్పించారు.
కానీ కుమార్ అనే పేరు ఉన్న మగపులి కొన్ని రోజులుగా దూకుడుగా ఉండటంతో దామిని అనే ఆడ పులిని పక్కనే ఉన్న ప్రత్యేక ఎన్‌క్లోజరులో బంధించారు. అకస్మాత్తుగా గురువారం సాయంత్రం మగపులి ఆడపులి ఎన్‌క్లోజరులోకి బలవంతంగా వైర్లు తెంచుకుని వెళ్ళింది. వెళ్ళడం వెళ్ళడం ఆడపులి మెడ పట్టుకుని కొరికింది. ఈ ఘటనలో ఆడపులి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయినట్లు అధికారులు చెప్పారు.
అయితే జంతు ప్రేమికులు మాత్రం అధికారుల అసమర్ధత కారణంగానే ఈ ఘటన జరిగిందని ఆరోపిస్తున్నారు. ఇనుప తీగను కూడా తెంపి వెళ్ళడానికి గలకారణాలు ఏమి ఉంటాయి అనే దాని మీద విచారణ జరిపిన అధికారులు, అది లైంగిక కోరికలతోనే ఆ విధంగా వెళ్లి ఉండవచ్చని భావిస్తున్నారు. ఈ ఘటనలో కుమార్‌కి కూడా గాయాలు అయ్యాయి.