ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) ప్రతి సంవత్సరం ఏప్రిల్ 7న ప్రపంచ ఆరోగ్య దినోత్సవాన్ని జరుపుకుంటుంది. ప్రతి ఏటా వైద్య రంగంలో తమ సేవలు అందించేవారికి అభినందనలు తెలుపుతూ ఈ దినోత్సవాన్ని జరుపుతుంది. కరోనా వైరస్ మహమ్మారి విజృంభించిన నేపధ్యంలో ఈ ఏడాది వైద్యులు, నర్సులు మరియు ఇతర ఆరోగ్య కార్యకర్తలు అందిస్తున్న అమోఘమైన సహకారం గుర్తించింది.