#Budget2021 : చెన్నై - బెంగుళూరు మెట్రోక్ మహర్ధశ .. ఊసేలేని ఏపీ!
సోమవారం, 1 ఫిబ్రవరి 2021 (13:08 IST)
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సోమవారం లోక్‌సభలో ప్రవేశపెట్టిన 2021-2022 బడ్జెట్‌లో చెన్నై, బెంగుళూరు మెట్రోకు నిధుల ప్రవాహం పారించారు. త్వరలో ఎన్నికలు జరుగనున్నందున చెన్నై మెట్రోకు రూ.63,246 కోట్లు కేటాయించగా, బెంగళూరు మెట్రోకు రూ.14,788కోట్లు ఇవ్వనున్నట్టు ప్రకటించారు. కానీ, ఏపీలో ప్రతిపాదిత విజయవాడ, వైజాగ్ మెట్రో ప్రాజెక్టు, హైదరాబాద్ మెట్రో గురించి నిర్మలా సీతారామన్ కనీసం మాటమాత్రం కూడా ప్రస్తావించలేదు. కాగా, ప్రసంగంలోని ముఖ్యాంశాలను పరిశీలిస్తే,
* 2022 జూన్ నాటికి తూర్పు, పశ్చిమ ప్రత్యేక సరకు రవాణా కారిడార్లు
* ఖరగ్‌పూర్-విజయవాడ మధ్య ఈస్ట్ కోస్ట్ సరకు రవాణా కారిడార్
* గోవా డైమండ్ జూబ్లీ సెలబ్రేషన్స్ కోసం రూ. 300 కోట్లు
* దేశంలోనే తొలిసారిగా డిజిటల్ పద్ధతిలో జనాభా లెక్కలు
* రైల్వే మౌలిక సౌకర్యాలకు రూ.1,01,055 కోట్లు
* కొచ్చి మెట్రో రెండో దశకు కేంద్రం సాయం
* చెన్నై మెట్రోకు రూ. 63,246 కోట్లు
* బెంగళూరు మెట్రోకు రూ.14,788కోట్లు
* 2023 కల్లా విద్యుదీకరణ పూర్తి
* జనగణనకు రూ. 3,678 కోట్ల కేటాయింపు
* ఆర్థిక రంగ పునరుత్తేజానికి రూ. 80 వేల కోట్లు
* 2021-2022 ద్రవ్యలోటు 6.8 శాతం
* 2025 నాటికి 4.8 శాతం టార్గెట్
* నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ కింద 1,500 స్కూళ్ల అభివృద్ధి