పెరుగుతో సౌందర్యాన్ని మెరుగుపరుచుకోవచ్చు. ముఖ చర్మం పొడిబారినట్లైతే.. చర్మంపై మచ్చలు ఏర్పడినట్లైతే పెరుగు దివ్యౌషధంగా పనిచేస్తుంది. డార్క్ స్కిన్ ప్యాచ్‌లున్న ప్రదేశంలో పెరుగును నేరుగా అప్లై చేస్తే ఫలితం ఉంటుంది. పెరుగును అప్లై చేసిన 20 నిమిషాల తర్వాత చల్లటి నీటితో శుభ్రం చేసుకుంటే చర్మం నిగారింపులు సంతరించుకుంటుంది.
అలాగే విధంగా స్కిన్ పిగ్మెంటేషన్‌కు కుంకుమ పువ్వు అద్భుతంగా చెక్ పెడుతుంది. బాదం మిక్సీలో వేసి, కొద్దిగా కుంకుమ పువ్వు కూడా వేసి మెత్తగా పౌడర్ చేసుకోవాలి. దీనికి కొద్దిగా పాలు మిక్స్ చేసి, ఈ మిశ్రమాన్నిస్కిన్ స్పాట్స్ మీద అప్లై చేయాలి. ఇది పూర్తిగా…ఆరిన తర్వాత చల్లటి నీటితో శుభ్రం చేసుకోవాలి.
అలాగే ఒక బౌల్‌లో చెంచా నిమ్మరసం వేసి అందులో చిటికెడు పసుపు చేర్చి బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని ముఖం, మెడకు రాసుకుని 15 నిమిషాల తర్వాత చల్లని నీటితో కడిస్తే చర్మం మెరిసిపోతుందని బ్యూటీషియన్లు చెప్తున్నారు.