ముందుగా చక్కెర పొడిలో నెయ్యి, గుడ్లు వేసి బాగా కలుపుకోవాలి. తర్వాత మైదా, తినే సోడా కూడా వేసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని రెండు భాగాలుగా విడదీసి ఒక సగంలో చాక్లెట్ పొడి, మరో సగంలో వెనీలా ఎసెన్స్ వేసి కలుపుకోవాలి. ఇప్పుడు బాణలి లోపల అడుగున కొద్దిగా నెయ్యి రాసి చాక్లెట్ పొడి కలిపిన మిశ్రమాన్ని ముందు వేయాలి. ఆ తర్వాత వెనీలా ఎసెన్స్ కలిపిన మిశ్రమం కూడా వేసి పైపైనే కలిపి కుక్కర్‌లో లేదా ఓవెన్‌లో 180 డిగ్రీ సెల్సియస్ వద్ద 45 నిమిషాలు ఉడికించాలి. అంతే... మార్బుల్ కేక్ రెడీ.