భారత బౌలర్లు అదుర్స్... 62 పరుగులకే కివీస్ ఆలౌట్..

శనివారం, 4 డిశెంబరు 2021 (16:30 IST)
India
న్యూజిలాండ్‌తో ముంబైలో జరుగుతున్న రెండో టెస్టు మ్యాచ్‌లో భారత బౌలర్లు విజృంభించారు. కివీస్ బౌలర్లు భారత బ్యాట్స్‌మెన్లకు చుక్కలు చూపించిన చందంగానే.. భారత బౌలర్లు కూడా కివీస్ ఆటగాళ్లకు కళ్లెం వేస్తున్నారు. రెండో టెస్టు మ్యాచ్ రెండో రోజైన శుక్రవారం మ్యాచ్ ఆలస్యంగా ప్రారంభమైనా రంజుగా సాగుతోంది. 
 
221/4 ఓవర్‌నైట్ స్కోర్‌తో రెండో రోజు ఆటను ప్రారంభించిన భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 325 పరుగులకు ఆలౌటైంది. మయాంక్ అగర్వాల్(311 బంతుల్లో 17 ఫోర్లు, 4 సిక్స్‌లతో 150) భారీ శతకంతో చెలరేగగా.. చివర్లో అక్షర్ పటేల్(128 బంతుల్లో 5 ఫోర్లు, సిక్స్‌తో 52) హాఫ్ సెంచరీతో రాణించాడు. న్యూజిలాండ్ బౌలర్లలో ఆజాజ్ పటేల్ ఒక్కడే 10 వికెట్లు తీసి భారత్ పతనాన్ని శాసించాడు. తద్వారా 10 వికెట్ల ఘనతను అందుకున్న మూడో బౌలర్‌గా గుర్తింపు పొందాడు.
 
తొలి రోజు బౌలింగ్‌లో న్యూజిలాండ్‌ పైచేయి చూపించినప్పటికీ, తర్వాత కోలుకున్న టీమిండియా బ్యాట్స్‌మెన్ ఆచితూచి ఆడారు. ముఖ్యంగా మయాంక్‌ అగర్వాల్‌ 120 పరుగులతో రాణించడంతో టీమిండియా మళ్లీ పుంజుకుంది.  న్యూజిలాండ్‌ స్పిన్నర్‌ అజాజ్‌ పటేల్‌ సరికొత్త చరిత్ర సృష్టించాడు.
 
ఇక టెస్టు క్రికెట్‌లో ఒకే ఇన్నింగ్స్‌లో పది వికెట్లు తీసిన మూడో బౌలర్‌గా నిలిచాడు. 1999లో పాకిస్థాన్‌పై అనిల్‌ కుంబ్లే సాధించిన ఈ ఘనత మళ్లీ ఇన్నాళ్లకు నమోదైంది. అంతకుముందు ఇంగ్లాండ్‌ బౌలర్‌ జిమ్‌ లేకర్‌ 1956లో ఆస్ట్రేలియాపై తొలిసారి ఈ రికార్డు సృష్టించాడు. 
 
దీంతో కివీస్‌ తరఫున అజాజ్‌ (10/119) అత్యుత్తమ బౌలింగ్‌ ప్రదర్శన చేసిన ఆటగాడిగా నిలిచాడు. ఇక ఈ మ్యాచ్‌లో భారత బ్యాట్స్‌మెన్‌ మయాంక్‌ అగర్వాల్‌ (150; 311 బంతుల్లో 17x4, 4x6), అక్షర్‌ పటేల్‌ (52; 128 బంతుల్లో 5x4, 1x6) రాణించారు.
 
ఇదే తరహాలో భారత బౌలర్లు కూడా సత్తా చాటారు. భారత్‌తో జరుగుతున్న రెండో టెస్ట్‌లో న్యూజిలాండ్ తమ ఫస్ట్ ఇన్నింగ్స్‌లో 62 పరుగులకే ఆలౌటైంది. మహ్మద్ సిరాజ్(3/19), రవిచంద్రన్ అశ్విన్(4/8), అక్షర్ పటేల్(2/14) వికెట్లతో విరుచుకుపడటంతో కివీస్ ఏ దశలోనూ కోలుకోలేకపోయింది. 
 
కైల్ జెమీసన్(17), టామ్ లాథమ్(10) టాప్ స్కోరర్లుగా నిలవగా.. మిగతా బ్యాట్స్‌మన్ సింగిల్ డిజిట్‌కే పరిమితమయ్యారు. భారత బౌలర్లలో సిరాజ్, అశ్విన్, అక్షర్‌కు తోడుగా జయంత్ యాదవ్ ఓ వికెట్ తీశాడు. దాంతో భారత్ 263 పరుగుల భారీ ఆధిక్యం లభించింది.
 
మహ్మద్ సిరాజ్(3/19), రవిచంద్రన్ అశ్విన్(4/8), అక్షర్ పటేల్(2/14) వికెట్లతో విరుచుకుపడటంతో కివీస్ ఏ దశలోనూ కోలుకోలేకపోయింది. 
 
Koo App
Well done on joining a club that eludes 99 percent of the bowlers that play the game Ajaz Patel

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు