సిరియాలోని అలెప్పో పట్టణం నరకానికి ప్రతీక అని ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యదర్శి బాన్ కీ మూన్ వ్యాఖ్యానించారు. అంతేకాకుండా, ప్రపంచ దేశాలకు సిరియా మారణహోమం ఓ మాయని మచ్చ అని అన్నారు. ఈ నెల 31న ఆ పదవి నుంచి వైదొలగనున్న బాన్ కీ మూన్ చివరిసారిగా మీడియాతో మాట్లాడారు.
తిరుగుబాటుదారులు, ప్రభుత్వ సైనికుల మధ్య జరిగిన అంతర్యుద్ధంతో రణరంగంగా మారిన సిరియాలోని అలెప్పో పట్టణం నరకానికి ప్రతీకగా మారిందని అభివర్ణించారు. దక్షిణ సూడాన్‌లోని నేతలు శాంతి ఒప్పందాన్ని దుర్వినియోగపరచడం వల్లే ఈ పరిస్థితులు ఏర్పడ్డాయని చెప్పుకొచ్చారు. అక్కడి నాయకులు తమ ప్రజలకు నమ్మకద్రోహం చేశారని బాన్ కీ మూన్ ఆగ్రహం వ్యక్తం చేశారు.