ఇంటి పైకప్పుపై ఎక్కి కూర్చున్న ఎస్‌యూవీ కారు.. ఎలాగో వీడియో చూడండి..

బుధవారం, 15 మార్చి 2017 (15:11 IST)
కొన్ని రోడ్డు ప్రమాదాలు ఘోరంగా ఉంటాయి. మరికొన్ని నవ్వు తెప్పిస్తాయి. కానీ చైనాలో చోటుచేసుకున్న వింత ప్రమాదం అందరికీ షాకివ్వడంతో పాటు నవ్వించింది. చైనా రోడ్డుపై వేగంగా దూసుకెళ్తున్న ఓ కారు.. ఉన్నట్టుండి అదుపు తప్పి.. రోడ్డుకు సమీపంలోని ఇంటి పై కప్పుపై ఎక్కి కూర్చుంది. ఈ రోడ్డు ప్రమాదాన్ని చూసినవారంతా షాక్ తిన్నారు.
 
కారు వేగంగా వెళ్తుండగా.. త్రిచక్ర వాహనం అడ్డుగా వచ్చింది. ఆ వాహనాన్ని ఢీ కొట్టకుండా ఉండేందుకు కారు డ్రైవర్ స్టేరింగ్ తిప్పేశాడు. అంతే కారు అదుపు తప్పింది.. అతివేగంతో పక్కనే ఉన్న ఇంటి పైకప్పుపై కారు ఎక్కి  కూర్చుంది. కారు డ్రైవర్‌ పెను ప్రమాదం నుంచి బయటపడటంతో అందరూ నవ్వుకున్నారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. 
 
పశ్చిమ చైనాలోని తైజూ సిటీలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఇంటిపై కప్పుపై చేరిన ఎస్‌యూవీ కారును క్రేన్ ద్వారా కిందికి దించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు. ఈ వీడియో మీ కోసం..
 

వెబ్దునియా పై చదవండి