ఈ పర్యటన సందర్భంగా ట్రంప్ కోరికను నెరవేర్చాలనుకున్నప్పటికీ భద్రత విషయమే అధికారులు కలవరపెడుతోంది. రాణి నివాసం ఉండే బకింగ్ హామ్ ప్యాలెస్‌కు భారీ భద్రత మధ్య ప్రత్యేక వాహనంలో ట్రంప్‌ను తీసుకెళ్లాలని అధికారులు భావిస్తున్నారు. అయితే, ఆ ప్రత్యేక వాహనం కాకుండా, బంగారు వర్ణంలో ఉండే రాణి గారి గుర్రపు బగ్గీని ఏర్పాటు చేయాలని వైట్ హౌస్ అధికారులు పట్టుబడుతుండటంతో.. భద్రతను కట్టుదిట్టం చేయనున్నారు.