శిథిలాల కింద ప్రాణాలతో బయటపడుతున్న చిన్నారులు

బుధవారం, 8 ఫిబ్రవరి 2023 (14:12 IST)
Earthquake
టర్కీ, సిరియా సరిహద్దుల్లో భారీ భూకంపం సంభవించిన సంగతి తెలిసిందే. ఈ భూకంపంలో వేలాది మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ భూకంపాలకు సంబంధించిన ఫోటోలు నెట్టింట వైరల్ అవుతోంది. 
 
ఈ ఫోటోలను చూసి ప్రపంచ దేశాలు ఆ దేశ ప్రజలకు సాయం చేసేందుకు ముందుకు వస్తున్నారు. తాజాగా ఓ ఫోటో నెట్టింట వైరల్ అవుతోంది. 
 
మంచంపై నిద్రస్తూనే శాశ్వత నిద్రలోకి వెళ్లిన ఓ 15 ఏళ్ల బాలిక చేయి పట్టుకుని ఆమె తండ్రి నిశ్చేష్ఠుడై కూర్చున్న తీరు చూపరుల చేత కన్నీళ్లు పెట్టిస్తోంది.
 
మెసట్‌ హన్సర్‌ అనే వ్యక్తి కుటుంబం భూకంపంలో చిక్కుకుపోయింది. భూకంపం వచ్చినప్పుడు హన్సర్‌ బయట ఉండటంతో ప్రాణాలతో మిగిలాడు. మిగిలినవారంతా శిధిలాల్లో సమాధి అయ్యారు.
 
మరోవైపు శిధిలాల తొలగింపు కార్యక్రమాన్ని సహాయక బృందాలు నిరంతరాయంగా కొనసాగిస్తున్నాయి. ఈ సందర్బంగా చిన్నారులు అనేక మంది ప్రాణాలతో బయటపడుతున్నారు. తల్లిదండ్రుల కోసం వారు చేస్తున్న ఆర్తనాదాలు కంటతడిపెట్టిస్తున్నాయి.  

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు