ఆన్లైన్లో బుక్ చేసుకునే ముందు కొన్ని విషయాలు గుర్తు పెట్టుకోవాలి. హడావుడిగా కాకుండా.. నెమ్మదిగా నిదానించి.. ఆఫర్లు తెలుసుకుంటే డబ్బును ఆదా చేసుకోవచ్చు. అమెజాన్ గ్రేట్ ఇండియన్ సేల్, స్నాప్‌డీల్ అన్‌బాక్స్ దివాళి సేల్, ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్... ఇలా ప్రముఖ ఆన్లైన్ షాపింగ్ సైట్లన్నీ భారీ ఆఫర్లను, డిస్కౌంట్స్‌ను ప్రకటించాయి.
అయితే ఆన్ లైన్ షాపింగ్ చేసేటప్పుడు
ఎక్స్ట్రా డిస్కౌంట్స్, క్యాష్‌బ్యాక్ ఆన్ క్రెడిట్, డెబిట్ కార్డ్స్ వంటి అంశాల గురించి ఆరాతీయండి. ఈ క్రమంలో ఫ్లిప్‌కార్ట్: ఎస్బీఐ డెబిట్, క్రెడిట్ కార్డ్స్‌పై 10శాతం అదనపు డిస్కౌంట్ ఇస్తోంది. 5 రోజుల ఫెస్టివల్ సీజన్లో 5,250 రూపాయలు డిస్కౌంట్ పొందే అవకాశం ఫ్లిప్ కార్టులో ఉంది.
ఇక అమేజాన్ సంగతికి వస్తే.. యాప్ ద్వారా బుక్ చేసుకుంటే 15శాతం క్యాష్‌బ్యాక్ హెచ్డీఎఫ్సీ డెబిట్, క్రెడిట్ కార్డ్స్‌పై 10శాతం క్యాష్‌బ్యాక్ ఆఫర్ ఉన్నాయి. స్నాప్‌డీల్: సిటీ కార్డ్ హోల్డర్స్‌కు 20శాతం డిస్కౌంట్ పొందవచ్చును.
ఆఫర్ తేదీలు: అమెజాన్: అక్టోబర్ 1 నుంచి 5వరకూ,
స్నాప్‌డీల్: అక్టోబర్ 2 నుంచి 6వరకూ