స్మార్ట్ ఫోన్ కంపెనీలు ప్రస్తుతం కష్టాల్లో కూరుకుపోతున్నాయి. బ్యాటరీలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. ఇప్పటికే స్మార్ట్ ఫోన్ బ్యాటరీ పేలుళ్లతో శాంసంగ్ భారీగా నష్టాలను మూటగట్టుకుంది. ఆపిల్ కూడా దాదాపు ఇదే బాటలో పయినిస్తోంది. తాజాగా ఐఫోన్ 6s బ్యాటరీ సమస్య సీరియస్ గానే ఉన్నట్టు యాపిల్ అంగీకరించింది. తాము మొదట ఊహించిన దానికంటే చాలా విస్తృతంగా ఉన్నట్టు భావిస్తున్నట్టు ధృవీకరించింది.
చైనీస్ వాచ్ డాగ్ యాపిల్ 6 ఎస్ తో పాటు 5ఎస్‌లో కూడా సమస్యలు ఉత్పన్నమైనట్టు రిపోర్ట్స్ వచ్చినా యాపిల్ ముందుగా ప్రకటించలేదు. కాగా ఐ ఫోన్ 6ఎస్ అకస్మాత్తుగా షట్ డౌన్ కావడం, పేలుడు సంభవిస్తున్నట్టుగా వినియోగదారులు ఫిర్యాదు చేశారు. దీంతో సమస్య ఉందని ఒప్పుకన్న సంస్థ సెప్టెంబర్ లేదా అక్టోబర్ 2015లో విక్రయించిన ఐఫోన్ 6ఎస్ బ్యాటరీ ఉచితంగా రిపేర్ చేస్తామని ప్రకటించిన సంగతి తెలిసిందే.
అంతేకాకుండా.. తొలుత కొన్ని లిమిటెడ్ ఐ ఫోన్లలో బ్యాటరీ సంస్థ ఉందని చెప్పుకొచ్చిన యాపిల్ సంస్థ.. ఒత్తిడి కాస్త పెరగడంతో చైనీస్ వెబ్ సైట్‌లో తప్పును ఒప్పుకుంది. దీనికి సంబంధించి మంగళవారం ఒక నోటీసును వెబ్ సైట్‌లో పోస్ల్ చేసింది. ఈ సమస్యకు ప్రధాన కారణం సాఫ్ట్ వేర్‌లో సమస్య అయి వుండవచ్చని అభిప్రాయపడింది. దీన్ని పరిష్కరించడానికి డేటా అదనపు విశ్లేషణ అవసరమవుతుందని తెలిపింది.