బ్యాటిల్ గ్రౌండ్స్ మొబైల్ ఇండియా పేరుతో సదరు కంపెనీ, భారత చట్టాలను అధిగమించి బ్యాక్ డోర్ ఎంట్రీ ఇస్తుందని, బ్యాటిల్ గ్రౌండ్స్ మొబైల్ ఇండియా భారత జాతీయ సార్వభౌమత్వానికి, భద్రతకు ముప్పు మాత్రమే కాదని, యువ తరాలకు హానికరం అని లేఖలో ప్రస్తావించారు.
జాతీయ భద్రతకు అపాయమని, మిలియన్ల మంది భారతీయ ప్రజల డేటాను తస్కరిస్తుందని, గోప్యతకు ప్రమాదాన్ని సృష్టిస్తుందని లేఖలో పేర్కొన్నారు. ఆ గేమ్‌ను ప్లే స్టోర్ ప్లాట్‌ఫామ్‌లో ఉపయోగించడానికి అనుమతించవద్దని గూగుల్‌ను కూడా కోరింది.