రైల్వేస్టేషన్లలో ఉచిత వైఫై.. గూగుల్ సంచలనం

మంగళవారం, 18 ఫిబ్రవరి 2020 (12:55 IST)
భారత్‌తో పాటు పలు దేశాల్లో రైల్వే స్టేషన్లలో అందించే ఉచిత వైఫై సేవలను ఆపేయాలని గూగుల్ నిర్ణయించింది. గత 2015 నుంచి భారత్‌తో పాటు ఇతర దేశాల రైల్వేస్టేషన్లలో రైల్వేశాఖతో చేతులు కలిపిన గూగుల్ ఉచిత వైఫై సేవలను అందిస్తోంది. వైఫై సేవలను తొలి విడతగా 400 రైల్వేస్టేషన్లలో ఆపేయనుంది గూగుల్. ఆపై విడతల వారీగా ఉచిత సేవలను ఆపేయాలని గూగుల్ నిర్ణయించుకుంది. 
 
ముందుగా భారత్‌లో ఈ సేవలను నిలిపేయాలని తీర్మానించింది. ఈ విషయాన్ని బ్లాగులో గూగుల్ తెలిపింది. ప్రపంచ దేశాల్లో అత్యధిక డేటాను వాడే దేశాల్లో భారత్ అగ్రస్థానంలో వుండగా.. ఇక్కడ చౌక ధరకే డేటా లభిస్తున్న కారణంగా ఉచిత డేటా అవసరం లేదనే నిర్ణయానికి వచ్చినట్లు గూగుల్ వెల్లడించింది. టాటా గ్రూప్, పవర్ గ్రిడ్ సంస్థలు భారత్‌లో ఉచిత సేవలను అందిస్తున్నాయి. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు