మనంట్లో ఉండే ఆ వేధవాయ్ ఎవరు?

శనివారం, 7 జులై 2018 (09:18 IST)
"ఎందుకు నాన్నా... ఎందుకలా ఏడుస్తున్నావ్...?" అంటూ అడిగింది తల్లి బిడ్డను. 
 
"మరి... నేను ఆడుకుంటుంటే చెడామడా తిట్టేసి కొట్టాడమ్మా...!!" అంటూ బదులిచ్చాడు కొడుకు.
 
"నిన్ను కొట్టింది ఎవడురా... ఈసారి నాకు కనబడనీ వాడి కాళ్లు విరగ్గొడతా..." అంటూ బుజ్జగించింది తల్లి. 
 
"వాడు ఎవడో కాదుమ్మా... మనింట్లోనే ఉన్నాడు.. అప్పుడప్పుడూ నీచేత దెబ్బలు కూడా తింటుంటాడు" 
 
"మనింట్లోనే ఉండే ఆ వెధవాయ్ ఎవడబ్బా...!!"
 
"ఇంకెవరు డాడీనే అమ్మా... నేను మట్టిలో ఆడుకుంటున్నానని వచ్చి కొట్టారు..."
 
"ఆఁ.....!!!" 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు