ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు. బాధిత యువతిపై అతని ప్రేమికుడు దీపక్ అత్యాచారానికి పాల్పడి.. నాలుగో అంతస్తు నుంచి విసిరేశాడని తెలుస్తోంది. అతడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారణను ముమ్మరం చేశారు. ఈ ఘటనలో దీపక్‌కు మాత్రమే కాకుండా మరో నలుగురి ప్రమేయం కూడా ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.