నేను మా ప్రొఫెసర్‌తో లేచిపోతున్నా... నన్ను వెతక్కండి... విద్యార్థిని మెసేజ్

గురువారం, 29 జూన్ 2017 (15:07 IST)
విద్యాబుద్ధులు నేర్పించాల్సిన గురువు వలలో పడింది ఓ విద్యార్థిని. ఆయనతో ఆకర్షణకు లోనై అతడితో లేచిపోయింది. వెళుతూ వెళుతూ ఈ విషయాన్ని తన తల్లిదండ్రులకు మెసేజ్ పెట్టింది. వివరాల్లోకి వెళితే.... లక్నోలోని డాక్టర్ శకుంతలా మిశ్రా రిహాబిలేషన్ యూనివర్శిటీలో 40 ఏళ్ల ప్రొఫెసర్ అరవింద్ శర్మ మెంటల్ రిటార్డేషన్ స్పెషల్ ఎడ్యుకేషన్‌ అసోసియేట్‌గా విధులు నిర్వహిస్తున్నారు. ఈయనకు పెళ్లయి ఇద్దరు పిల్లలు కూడా వున్నారు. 
 
కానీ తన వద్ద ఫైనల్ సెమిస్టర్ చదువుతున్న 25 ఏళ్ల విద్యార్థినితో ప్రేమలో పడ్డాడు. అక్కడే వుండి ప్రేమ కలాపాలు సాగించడం కష్టమని తలచిన గురువుగారు ఆమెను తన వెంట తీసుకుని వెళ్లాలని నిర్ణయించుకున్నాడు. అనుకున్నదే తడవుగా ఆమెను తీసుకుని జూన్ నెల 19న జంప్ అయ్యాడు. 
 
విద్యార్థిని కూడా తన తల్లిదండ్రుకు సందేశమిస్తూ... తన గురువుకు భార్యాపిల్లలున్న సంగతి తనకు తెలుసుననీ, ఐనా ఆయన లేకుండా నేను వుండలేను కనుక ఇద్దరం కలిసి పారిపోతున్నట్లు తెలిపింది. తమకోసం ఎవ్వరూ వెతకవద్దని తెలిపింది. దీనితో ఆమె తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

వెబ్దునియా పై చదవండి