తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత శశికళ వర్గంతో నానా కష్టాలు అనుభవించారని మాజీ స్పీకర్ పీహెచ్ పాండియన్, మాజీ ఎంపీ మనోజ్ పాండ్యన్లు తెలిపారు. వీరిద్దరూ మంగళవారం మీడియాతో మాట్లాడుతూ.. జయలలిత మృతి పట్ల షాకింగ్ నిజాలను బయటపెట్టారు. జయలలితను విషం పెట్టి చంపారనే చందంగా పీహెచ్ పాండ్యన్ చెప్పారు.
అనంతరం మాట్లాడిన మనోజ్ పాండియన్.. ఇంతకుముందే శశి వర్గం.. జయలలిత విషం పెట్టి చంపేస్తారని బోరున విలపించినట్లు.. జడుసుకున్నట్లు తెలిపారు. ఇంకా ఆయన మాట్లాడుతూ.. తాను జయ టీవీలో పనిచేస్తున్న సందర్భంలో ఓసారి అమ్మ తమతో మాట్లాడారని.. ఆ సందర్భంలో జయలలిత కన్నీరు పెట్టుకున్నారని.. శశి వర్గం తనకు విషం పెట్టి చంపేస్తారని భయపడినట్లు తెలిపారు.