స్మార్ట్ ఫోన్లు, సోషల్ మీడియా ప్రభావంతో వీడియోలు, సెల్ఫీలపై పిచ్చి ముదిరింది. మనుషులు ప్రాణాలతో చెలగాటమాడుతున్నా.. ప్రాణాలు కోల్పోయే పరిస్థితుల్లో వున్నా.. వారిని రక్షించకుండా ఎంచక్కా వీడియోలు తీసే వారు ఎక్కువైపోతున్నారు. మొన్నటికి మొన్న.. ఓ ప్రేమ జంట పరువు హత్యకు గురైతే.. ఆమె ప్రాణాలతో కొట్టుమిట్టాడుతుంటే పట్టించుకోకుండా ఫోన్లలో వీడియోలు తీసుకుంటూ గడిపిన ఘటన చోటుచేసుకుంది.
ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం ఇంటర్నెట్లో హల్ చల్ చేస్తోంది. ఈ ఘటన సోమవారం చోటుచేసుకున్నట్లు తెలుస్తోంది. వీరి మృతదేహాల జాడ తెలుసుకోవడానికి హిల్ రైడర్స్‌ను, పర్వతారోహకులను రంగంలోకి దించారు. వారి ఆచూకీ తెలిసినా వర్షం కారణంగా వెలికితీత కష్టంగా మారిందని పోలీసులు చెప్పారు.
యువకులను ఇమ్రాన్ గరాదీ, ప్రతాప్ రాథోడ్‌గా పోలీసులు గుర్తించారు. కొల్హాపూర్ నుంచి ఏడుగురు స్నేహితులతో కలిసి ఈ యువకులు విహార యాత్రకు వచ్చారని, మద్యం మత్తులో బ్రిడ్జి మీద విన్యాసాలు చేయడానికి ప్రయత్నించారని, ఆ ప్రయత్నంలో భాగంగా లోయలో పడిపోయారని పోలీసులు వెల్లడించారు.