మధ్యాహ్న భోజనంలో పాము... విద్యార్థులకు అస్వస్థత

ఆదివారం, 28 మే 2023 (08:59 IST)
బీహార్ రాష్ట్రంలో విద్యార్థుల కోసం అమలు చేస్తున్న మధ్యాహ్న భోజన పథకంలో విషాదం జరిగింది. ఈ రాష్ట్రంలోని ఓ పాఠశాలలో విద్యార్థుల కోసం వండిన మధ్యాహ్న భోజనంలో పాము కనిపించింది. ఆ భోజనం తిన్న చిన్నారుల్లో దాదాపు 25 మంది అస్వస్థతకు గురయ్యారు. ప్రస్తుతం వీరంతా స్థానిక ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. 
 
చిన్నారుల ఆరోగ్యం మెరుగ్గానే ఉందని అధికారులు తెలిపారు. అయితే, ఆ భోజనాన్ని పాఠశాలలో వండలేదని.. ఓ కాంట్రాక్టరు సరఫరా చేసినట్లు సిబ్బంది చెబుతున్నారు. ఈ ఘటన అరారియా జిల్లాలోని ఫర్‌బిస్‌గంజ్‌ సబ్‌డివిజన్‌ పరిధి జోగ్‌బాని సెకండరీ స్కూలులో జరిగింది. మధ్యాహ్న భోజనం ఆరగించిన విద్యార్థుల్లో చాలామంది వాంతులు చేసుకున్నారు. పాఠశాల వద్దకు చేరుకున్న తల్లిదండ్రులు ఆందోళనకు దిగారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు