ఐదు రాష్ట్రాల ఎన్నికల ప్రక్రియలో భాగంగా శనివారం ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. ఇందుకోసం ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని 75 జిల్లాల్లో 78 కౌంటింగ్ కేంద్రాలు, పంజాబ్‌లో 27 ప్రాంతాల్లోని 54 కేంద్రాలు, ఉత్తరాఖండ్‌లో 15 కేంద్రాలు, గోవాలో రెండు కేంద్రాల్లో కౌంటింగ్ జరుగనుంది.
కాగా, ఓట్ల లెక్కింపు సమయంలో ఎలాంటి అల్లర్లు జరగకుండా ఆయా కేంద్రాల వద్ద వేల సంఖ్యలో కేంద్ర భద్రతా బలగాలు మోహరించాయి. ఇప్పటికే తొలి రౌండ్ ఫలితం వెల్లడైంది. ప్రాథమిక ట్రెండ్ మేరకు ఉత్తరప్రదేశ్‌లో బీజేపీ 13, ఎస్పీ, కాంగ్రెస్ పార్టీల కూటమి 9 చోట్ల ఆధిక్యంలో ఉన్నాయి. అలాగే, ఆమ్ ఆద్మీ పార్టీ, కాంగ్రెస్ తలా రెండు చోట్, బీజేపీ కూటమి ఒక చోట ఆధిక్యంలో ఉన్నాయి.
మరోవైపు.. ఆయా రాష్ట్రాల్లో ఉన్న అసెంబ్లీ సీట్లు, కనీస మెజార్టీని పరిశీలిస్తే...
యూపీలో మొత్తం స్థానాలు 403 కాగా, మేజిక్ ఫిగర్ 202 సీట్లు
పంజాబ్‌లో మొత్తం సీట్లు 117 కాగా, మేజిక్ ఫిగర్ 59 సీట్లు
ఉత్తరాఖండ్‌లో మొత్తం సీటు 70 సీట్లు కాగా, మేజిక్ ఫిగర్ 36 సీట్లు
మణిపూర్‌లో మొత్తం సీట్లు 70 కాగా, మేజిక్ ఫిగర్ 31 సీట్లు
గోవాలో మొత్తం సీట్లు 40 కాగా, మేజిక్ ఫిగర్ 21 సీట్లు.