ఇటీవలే ఆమె అమెరికా వెళ్లింది. ఆ దేశంలో కాలు పెట్టిన రాఖీ సావంత్ గుర్తింపు కోసమే లేదంటే ఫ్యాషన్ కోసమోగానీ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఫోటో ఉన్న దుస్తులు వేసుకుంది. అవి కూడా చాలా కురచగా, బిగుతుగా ఉండటంతో ఆమె ఎబ్బెట్టుగా కనిపించింది. ఆమె ఆనందం సంగతేమోగానీ, అలాంటి దుస్తులు వేసుకుని ప్రధానమంత్రిని అవమానపరిచిందంటూ ఓ న్యాయవాది జైపూర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీనితో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.