తమిళనాడు రాష్ట్ర ముఖ్యమంత్రిగా శశికళ బాధ్యతలు చేపట్టనుండటం అంటే ప్రజలకు ఇంతకన్నా దురదృష్టం మరోటి ఉండదని ముఖ్యమంత్రి దివంగత జయలలిత మేనకోడలు దీపా జయకుమార్ వ్యాఖ్యానించారు. ఆదివారం జరిగిన అన్నాడీఎంకే శాసనసభాపక్ష సమావేశంలో తమ పార్టీ నేతగా శశికళను ఎమ్మెల్యేలంతా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అదేసమయంలో ముఖ్యమంత్రి పదవికి ఓ పన్నీర్ సెల్వం రాజీనామా చేశారు.
ఈ పరిణామాలపై దీప స్పందించారు. తమిళనాడులో అధికారాన్ని చేపట్టేందుకు శశికళ బృందం మిలిటరీ తరహా కుట్రకు పాల్పడుతోందని ఆరోపించారు. తమిళనాడుకు శశికళ ముఖ్యమంత్రి అవడం అంటే ప్రజలకు ఇంతకన్నా దురదృష్టం మరొకటి ఉండదన్నారు. కాగా, శశికళ ఈనెల 7 లేదా 9 తేదీల్లో ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉంది.