వైద్య శాస్త్రంలో అద్భుతం జరిగింది. యేడాదిన్నర వయసున్న పసిబిడ్డ కడుపులో మూడున్నర కేజీల పిండం ఉంది. దీన్ని వైద్యులు వెలికి తీశారు. ఈ వివరాలను పరిశీలిస్తే.. ఈరోడ్ జిల్లా పుంజే పులియంపట్టి అనే గ్రామానికి చెందిన రాజు, సుమతి అనే దంపతులకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. వీరిలో రెండో బిడ్డ నిషాకు యేడాదిన్నర వయసు ఉంటుంది. ఈ బిడ్డకు పుట్టే సమయంలోనే పొట్ట పెద్దదిగా ఉన్నది.
రోజులు గడిచే కొద్దీ... ఆ పాపకు పొట్ట కూడా పెద్దదవుతూ వచ్చింది. దీంతో ఆందోళనకు గురైన ఆ రాజు, సుమతిలు సమీపంలోని ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడు స్కానింగ్ చేసిన వైద్యులు.. బిడ్డ కడుపులో పిండం పెరుగుతున్నట్టు గుర్తించారు. దీంతో కొన్ని గంటల పాటు శ్రమించి ఆ పిండాన్ని వైద్యులు వెలికి తీశారు. ఈ పిండం మూడున్నర కేజీల బరువు వుంది.