భారీగా పెరిగిన బంగారం ధర, ఎంతో తెలిస్తే షాకవుతారు...
బుధవారం, 22 జులై 2020 (20:32 IST)
బంగారం ధర ఎన్నడూ కనీవినీ ఎరుగనంతగా పెరిగింది. 10 గ్రాముల బంగారం ధర రూ.50,010కి చేరింది. గత సెషన్లో ధరలు 1 శాతం మేర పెరగడంతో రూ.500కి పైగా బంగారం ధర పెరిగింది.
దీంతో 24 క్యారెట్స్ గోల్డ్ 10 గ్రాముల ధర (ముంబై) రూ.51,380కి చేరింది. ఫ్యూచర్ మార్కెట్లో గోల్డ్ రేట్ రూ.50 వేలు దాటడం దేశంలో ఇదే తొలిసారిగా చెప్పొచ్చు.
ప్రపంచవ్యాప్తంగా కరోనా మహమ్మారి విజృంభిస్తుండటంతోపాటు యూఎస్–చైనా వాణిజ్య యుద్ధంతో అనిశ్చితి పరిస్థితులు నెలకొనడంతో పసిడిపై పెట్టుబడికి డిమాండ్ పెరిగింది.
కాగా, మల్టీ కమోడిటీ ఎక్సేంజ్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (ఎంసీఎక్స్) సెప్టెంబర్ ఫ్యూచర్స్‌లో సిల్వర్ రేటు 6.6 శాతానికి పెరిగింది. వెండి కిలోకు సుమారుగా రూ.3,400కు పెరిగి రూ.61,130కి చేరింది.