ఉత్తరప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ జెట్ స్పీడ్ వేగంతో దూసుకెళుతోంది. ఈ ఫలితాలపై ఎగ్జిట్ పోల్ ఫలితాలు నిజమవుతున్నాయి. ప్రారంభ ట్రెండ్ బీజేపీ ప్రభంజనానికి సంకేతాలు ఖాయమవుతున్నాయి. బీజేపీ భారీ ఆధిక్యంలో ఉంది. పట్టున్న ప్రాంతాల్లోనూ ఎస్పీ, బీఎస్పీ ఖంగుతింటున్నాయి.
ప్రస్తుతం 240 స్థానాల్లో బీజేపీ ఆధిక్యంలో ఉండగా, ఎస్పీ - కాంగ్రెస్ పార్టీలు 75, బీఎస్పీ 26 స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నాయి. ఇతరులు 2 స్థానాల్లో ఆధిక్యంలో ఉండటం గమనార్హం. ఇదిలావుంటే లక్నోలో ములాయం చిన్నకోడలు అపర్ణ వెనుకంజలో ఉన్నారు.
ఇతర రాష్ట్రాల విషయానికొస్తే.. పంజాబ్లో కాంగ్రెస్ ముందంజలో ఉండగా ఆప్ వెనుకబడింది. ఉత్తరాఖండ్లో కాంగ్రెస్, బీజేపీల మధ్య హోరాహోరి కొనసాగుతోంది. మణిపూర్లో బీజేపీ, కాంగ్రెస్ పార్టీల మధ్య పోటా పోటీ నెలకొంది.