ఎన్నికలు 2014... ఉత్తరాదిలో స్టార్ట్ అయిన నరేంద్ర మోడీ మేనియా

శుక్రవారం, 24 జనవరి 2014 (21:54 IST)
PR
నరేంద్ర మోడీ... ఇపుడు ఉత్తరాది భారతదేశంలో దాదాపు నరేంద్ర మోడీ మేనియా సాగుతోందని పలు సర్వేలు వెల్లడిస్తున్నాయి. ఓ ప్రైవేట్ ఛానల్ నిర్వహించిన సర్వేలో నరేంద్ర మోడీ ప్రభావంతో ఉత్తరాదిన అత్యధిక సీట్లను భాజపా కైవసం చేసుకోబోతున్నట్లు వార్తా కథనాన్ని ప్రచురించింది.

అదేవిధంగా మోడీ దక్షిణాదిన కూడా టార్గెట్ పెట్టుకున్నారు. ఇందులో భాగంగా ఇప్పటికే తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుతో మంతనాలు సాగుతున్నట్లు సమాచారం. ఐతే రాష్ట్ర భాజపా నేతలు మాత్రం ఈ పొత్తుపై ఆసక్తిని కనబరచడం లేదు. ఎందుకంటే దీర్ఘకాలంలో నష్టం జరుగుతుందని వారు చెపుతున్నట్లు తెలుస్తోంది. మొత్తమ్మీద ఎన్నికలు 2014 హీట్ అప్పుడే మొదలయింది.

వెబ్దునియా పై చదవండి